కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకున్నది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది .దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించింది. ఈ బిల్లును ఆమోదించటం ద్వారా ఖజానాను నింపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యెడియూరప్ప విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు వసూలు చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాల ఆదాయంపై ఎందుకు దృష్టి సారించటం లేదన్నది లక్షలాది హిందూ భక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z