DailyDose

కవిత అరెస్ట్ తప్పదా?-CrimeNews-Feb232024

కవిత అరెస్ట్ తప్పదా?-CrimeNews-Feb232024

* ఢిల్లీ లిక్కర్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు అంటున్నాయి. ఇదే కేసుల ఇప్పటికే కవితను మూడుసార్లు సీబీఐ ప్రశ్నించింది. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్‌ కేసులో నిందితురాలిగా సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది.

* ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్‌కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్‌లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్‌ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్‌లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్‌పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్‌ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఐదు స్టార్టప్‌ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది.

* ఓ కాంగ్రెస్ నాయ‌కుడు త‌న కోరిక‌లు తీర్చాలంటూ ఓ మ‌హిళ‌ను వేధింపుల‌కు గురి చేశాడు. ఆ కామాంధుడి వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హైద‌ర్‌షా కోట్‌లో ఓ వివాహిత నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి స‌మీపంలోనే సుద‌ర్శ‌న్ అనే కాంగ్రెస్ నాయ‌కుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఆ వివాహిత‌పై క‌న్నేసిన కాంగ్రెస్ నాయ‌కుడు.. త‌న కోరిక‌ల‌ను తీర్చాలంటూ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. వివాహిత ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఆ సీసీ టీవీ ద్వారా ఆమె క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తూ ఫాలో అవుతున్నాడు. కామ వాంఛ తీర్చ‌క‌పోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డంతో పాటు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ, సైగ‌లు చేస్తున్నాడు. కామాంధుడి వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు నార్సింగి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* ఓ యువ‌కుడు పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. ఆ మ‌త్తులో హై టెన్ష‌న్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. రెండు గంట‌ల పాటు విద్యుత్ స్తంభంపైనే ఉన్నాడు. ఈ ఘ‌ట‌న మీర్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బాలాపూర్ చౌర‌స్తా వ‌ద్ద నిన్న రాత్రి చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, యువ‌కుడిని కింద‌కు దించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు రెండు గంట‌ల త‌ర్వాత ఆ యువ‌కుడిని పోలీసులు కింద‌కు దించారు. మందుబాబు కింద‌కు దించ‌డానికి పోలీసులు ముప్పుతిప్ప‌లు ప‌డ్డారు. యువ‌కుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

* కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం యావత్‌ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. పటాన్‌ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి అయ్యాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ‘‘తలకు బలమైన గాయాలు కావడం వల్లే అక్కడికక్కడే ఆమె చనిపోయారు. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్‌, రిబ్స్‌ ఫ్రాక్ఛర్‌ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z