Politics

విజయమ్మ మౌనం దేనికి సంకేతం?

విజయమ్మ మౌనం దేనికి సంకేతం?

ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూసుకెళుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్నాక షర్మిల.. ఏపీలో మరుగున పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత జీవం తీసుకుని వచ్చారు.

ఏపీలోకి కాంగ్రెస్ చీఫ్‌గా అడుగుపెట్టీ పెట్టగానే.. ప్రజాపోరాటాన్ని ఆరంభించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. ఇక ఇప్పుడు నిరుద్యోగ సమస్యలపై గళమెత్తారు. జగన్ ఉత్తి డీఎస్సీని ప్రకటించారని.. మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అరెస్ట్ కూడా అయ్యారు. తెలంగాణలో షర్మిల అరెస్ట్ అయితే విజయమ్మ రంగంలోకి దిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? ఒకవేళ జరిగితే జగన్‌ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. అప్పట్లో అంత హడావుడి చేసిన విజయమ్మ ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? అవతల ఉన్నది కొడుకునా? మరి అదే కొడుకు ఇంటి నుంచి తరిమేశాడు కదా? పైగా మేనల్లుడి వివాహానికి సైతం హాజరు కాలేదు. అలాంటి కొడుకు కోసం విజయమ్మ బయటకు రావడం లేదా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z