* గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్ సర్వీస్ జీమెయిల్ (Gmail) సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్ (google) స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది. ఏళ్లుగా లక్షలాది మందికి ఇ-మెయిల్ సేవలు అందిస్తున్న జీమెయిల్ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్ పంపించడం గానీ, పొందడం గానీ చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్‌కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. అది కాస్తా ఎక్స్, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది జీమెయిల్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
* రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. డిజిటల్ యుగంలో ఆ బాధ తప్పింది. రుణం తీసుకోవడం సులువైపోయింది. అనుకున్నదే తడవుగా ఇప్పుడు లోన్ లభిస్తోంది. సింగిల్ క్లిక్‌తో ఎటువంటి డాక్యుమెంట్లూ తీసుకోకుండానే పని పూర్తయిపోతోంది. సులువుగా ఇన్‌స్టంట్ రుణాలు లభిస్తుండడంతో ఈ తరహా లోన్లకు ఆదరణ పెరుగుతోంది. ఒకవేళ మీరూ ఈ తరహా రుణాలు తీసుకోవాలనుకుంటే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.
* ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్య తరచూ వైరల్‌గా మారుతున్నాయి. ఓ వస్తువు బుక్ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం.. లేదా వాడిన వస్తువో, నకిలీదో తెచ్చి ఇవ్వడం వంటి ఘటనలు సోషల్‌మీడియా వేదికగా బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి అనుభవమే ఓ వినియోగదారుడికి ఎదురైంది. ఈ విషయాన్ని అతడు ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. సోషల్‌మీడియాలో పాపులర్ అయిన గబ్బర్ సింగ్ అనే వ్యక్తి తాజాగా అమెజాన్ (Amazon) నుంచి ఐఫోన్ 15 (iPhone 15)ను ఆర్డర్ చేశాడు. డెలివరీ అందాక అది నకిలీ ఫోన్ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. ‘అమెజాన్ నాకు నకిలీ ఐఫోన్ 15ను డెలివరీ చేసింది. ఇందులో కేబుల్ కూడా లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారా?’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసి, అమెజాన్‌కు ట్యాగ్ చేశాడు.
* ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ తన ఎథేర్ 450ఎస్, ఎథేర్ 450ఎక్స్ స్కూటర్లను అప్ డేట్ చేసింది. రేర్‌లో క్రోమ్ ఫినిష్‌తో బెల్ట్ కవర్‌పై న్యూ ఎథేర్ లోగో వస్తుంది. బెల్ట్ కవర్ సాయంతో వర్షాకాలంలో డర్ట్, బురద నుంచి రక్షణ లభిస్తుంది. ఇకప్రస్తుతం మార్కెట్లో ఎథేర్ మూడు స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. వాటిల్లో 450ఎక్స్, 450ఎస్, 450 అపెక్స్ ఉన్నాయి. 450ఎస్ స్కూటర్ రూ.97,547, (ఎక్స్ షోరూమ్), 450ఎక్స్ రూ.1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌గా ఆవిష్కరించిన 450 అపెక్స్ రూ.1.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
* ఐదు రోజుల్లో మరో నెల చరిత్ర గర్భంలో కలిసిపోనున్నది. వచ్చే శుక్రవారం నుంచి 2024 మార్చి నెలాఖరు ప్రారంభం కానున్నది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల నిర్వహణకు బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా, కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు బ్యాంకు శాఖలను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మార్చిలో 31 రోజుల్లో 14 రోజులు బ్యాంకులకు సెలవు. ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు మరో ఏడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం మార్చి 1,8,22,25,26,27, 29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. 3, 10, 17,24, 31 తేదీల్లో ఐదు ఆదివారాలు, 9,23 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు.
*** బ్యాంకులకు సెలవులు ఇలా
మార్చి 1 – మిజోరంలో చాప్ చార్ కుట్ సందర్భంగా బ్యాంకులకు సెలవు
మార్చి 3- ఆదివారం
మార్చి 8 – మహా శివరాత్రి సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు
మార్చి 9 – రెండో శనివారం
మార్చి 10- ఆదివారం
మార్చి 17 – ఆదివారం
మార్చి 22 – బీహార్ దివస్ సందర్భంగా బీహార్ లో బ్యాంకులు పని చేయవు.
మార్చి 23- నాలుగో శనివారం
మార్చి 25- హోలీ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశమంతా సెలవు
మార్చి 26- హోలీ రెండో రోజు సందర్భంగా ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
మార్చి 27- హోలీ సందర్భంగా బీహార్ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మార్చి 20- గుడ్ ఫ్రైడే సందర్భంగా త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z