Devotional

రాత్రి పూట కూడా శ్రీశైలం వెళ్లవచ్చు

రాత్రి పూట కూడా శ్రీశైలం వెళ్లవచ్చు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. చోదకులు పరిమిత వేగంతో, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z