NRI-NRT

తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ఎన్నికకు బోర్డు ఆమోదం

తానా అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ఎన్నికకు బోర్డు ఆమోదం

తానా 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జనవరి 19వ తేదీన పూర్తి కాగా, పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల సరళిపై, ఓటింగ్ ప్రక్రియపై పలు అనుమానాలు లేవనెత్తారు. వీటిని పరిగణలోకి తీసుకున్న బోర్డు ఎన్నికల కమిటీ నుండి మరింత సమాచారాన్ని కోరింది. దీన్ని సమీక్షించిన బోర్డు అభ్యర్థుల ప్రశ్నలను తోసిపుచ్చుతూ నరేన్ కొడాలితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులందరి ఎన్నిక చెల్లుతుందని, వారు శుక్రవారం మార్చి 1వ తేదీ నుండి నూతన పదవుల్లోకి బాధ్యతలు స్వీకరించవచ్చునని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z