రజనీకాంత్ కథానాయకుడిగా టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం సోమవారం నుంచి రానా రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు వెల్లడించారు. ‘‘తొలిరోజు ‘తలైవర్ 170’ సెట్లో’’ అంటూ ఓ సెల్ఫీని పంచుకున్నారు. ‘జై భీమ్’ తరహాలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న సామాజిక సందేశమున్న చిత్రమిది. ఇందులో రజనీ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 80శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z