Devotional

ఇంద్రకీలాద్రిపై నకిలీ అధికారి వీరంగం

ఇంద్రకీలాద్రిపై నకిలీ అధికారి వీరంగం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రొటోకాల్‌ దర్శనం కోసం ఒక వ్యక్తి ఐఆర్‌ఎస్‌ అధికారి అవతారమెత్తడం కలకలం రేపింది. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆదాయపన్ను జాయింట్‌ కమిషనర్‌ ఐడీ చూపి ప్రొటోకాల్‌ దర్శనం ఇవ్వలేదని ఆలయ దిగువ స్థాయి సిబ్బందిని దుర్భాషలాడాడు. దీంతో సిబ్బంది అతడిని ఐడీ కార్డు చూపమన్నారు. ఆయన వి.శ్రీనివాస్‌ పేరుతో ఒక కార్డు, ఆనంద్‌ పేరుతో మరో కార్డు చూపించాడు. సిబ్బందికి అనుమానం వచ్చి విషయాన్ని అవుట్‌ పోస్టు పోలీసుల దృష్టికి తీసుకు రావడంతో ఫేక్‌ ఐఆర్‌ఎస్‌ బండారం బయటపడింది. ఆరు నెలల కిందట ఇతనే దుర్గగుడికి వచ్చి ఇదేవిధంగా దిగువస్థాయి సిబ్బందిని దుర్భాషలాడడంతో అతడి గురించి దేవస్థానం అధికారులు అప్పట్లో ఆరా తీశారు. అతడు ఐఆర్‌ఎస్‌ అధికారి కాదని నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు అప్రమత్తమయ్యారు. నిందితుడిని వన్‌టౌన్‌ పోలీసుస్టేషనుకు తరలించారు. పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి అతడిని విచారించడంతో అసలు విషయం నిర్ధారణ అయ్యింది. దుర్గగుడి అధికారుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు స్వీకరించిన తరువాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z