Business

బెజవాడలో రైల్వే ప్రయాణీకులకు స్విగ్గీ సౌకర్యం-BusinessNews-Mar 05 2024

బెజవాడలో రైల్వే ప్రయాణీకులకు స్విగ్గీ సౌకర్యం-BusinessNews-Mar 05 2024

* రైలు ప్రయాణికులు ఇకపై తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారంట్‌ నుంచి తెప్పించుకోవచ్చు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ (శ్విగ్గ్య్) ఆ ఫుడ్‌ను మీకు అందివ్వనుంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ (ఈఋఛ్ట్ఛ్), స్విగ్గీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మార్చి 12 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌, బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

* బంగారం ధరకు (ఘొల్ద్ ప్రిచె) ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాములు మేలిమి స్పాట్‌ గోల్డ్‌ ధర మంగళవారం ఒక్కరోజే రూ.800 మేర పెరిగి రూ.65 వేలకు చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.64,200 వద్ద ముగిసింది. అటు వెండి సైతం కేజీ రూ.900 మేర పెరిగి రూ.74,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రభావంతోనే దేశీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

* గూగుల్ ప్లేస్టోర్‌ (ఘూగ్లె ఫ్లయ్శ్తొరె) నుంచి తొలగించిన భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను రీస్టోర్‌ చేసేందుకు గూగుల్‌ అంగీకరించింది. ఈమేరకు కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (ఆష్విని వైష్నవ్) సమక్షంలో గూగుల్‌ సంస్థ, స్టార్టప్‌ కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఫీజు చెల్లింపులపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దేశ సాంకేతిక రంగ అభివృద్ధికి గూగుల్‌ తోడ్పాటునిస్తుందని మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు వైష్ణవ్‌ తెలిపారు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల (శ్తొచ్క్ మర్కెత్) వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఇటీవల జీవనకాల గరిష్ఠాల వద్ద ట్రేడయిన సూచీలు.. మదుపరుల అప్రమత్తత కారణంగా నష్టాలు ఎదుర్కొన్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌పావెల్‌ కాంగ్రెస్‌ ముందు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే వారం అమెరికా జాబ్‌ డేటా రానుంది. ఈక్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సహా దేశీయ మార్కెట్‌ సూచీలూ నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

* ప్రముఖ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ఛత్ఘ్ఫ్ట్) ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్‌ఏఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘రీడ్‌ ఏ లౌడ్‌’ పేరిట వచ్చిన ఈ ఫీచర్‌ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్‌ చూసి టెక్ట్స్‌ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వెబ్‌ వెర్షన్‌తో పాటు ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.

* బ్యాంకులో మీకు ఖాతా ఉందా? అయితే, మీరు మరోసారి కేవైసీని (ఖ్Yఛ్) అప్‌డేట్‌ చేయాల్సి రావొచ్చు. బ్యాంకులు తమ కేవైసీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గానూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ, ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే ఫోన్‌ నంబర్‌తో వివిధ ఖాతాలు కలిగిన వారు లేదా జాయింట్‌ ఖాతాలు కలిగిన వారు మరోసారి కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాల్సి రావొచ్చు. అంతేకాదు వివిధ రకాల డాక్యుమెంట్లతో వేర్వేరు అకౌంట్లు తెరిచిన వారు అదనపు సమాచారం బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z