* దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. ఇందులో ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు ఉండడం గమనార్హం. తాజాగా ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌ను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ప్రభుత్వ అధికారుల పేరు చెప్పిన కేటుగాళ్లు ఏకంగా రూ.4.80కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకున్నది. మల్టినేషనల్ కంపెనీకి చెందిన మాజీ ఎండీ సాహేబ్‌ను నేరగాళ్లు ఫోన్ చేసి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుంటారంటూ బెదిరింపులకు గురి చేసి రూ.4.80కోట్లు లూటీ చేశారు. ఈ ఘటనలో థానే క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. అయితే, సదరు వ్యక్తులు కస్టమ్స్ అధికారులుగా చెప్పుకుంటూ కంపెనీ మాజీ ఎండీకి ఫోన్ చేశారు. తైవాన్ మార్గంలో ఓ ప్రధాన కొరియర్ కంపెనీకి చెందిన కస్టమ్స్ కార్యాలయంలో ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు గడువు తీరిన పాస్‌పోర్టులు, క్రిడిట్‌కార్డులతో సహా పలు నిషేధిత వస్తువులున్న పార్శిల్స్‌ను అడ్డగించినట్లు సదరు ఫోన్ చేశారు. వ్యవహారం నుంచి బయటపడేందుకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్‌నంబర్ సమాచారం చెప్పాలని లేకపోతే.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దాంతో పాటు అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత వీడియో కాలింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయించి డెబిట్‌కార్డు సమాచారాన్ని అడిగారు. ఆ తర్వాత ఎండీ ఖాతా నుంచి ఆయన భార్య పేరు మీదకు రూ.కోటి బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఖాతా నుంచి రూ.4.80కోట్లు విత్‌డ్రా అయ్యాయని గుర్తించారు.
* కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
* గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్‌ను తక్షణమే తొలగిస్తామని 77 ఏండ్ల డాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫిబ్రవరి 23న బెదిరింపు కాల్ రావడంతో బాధితుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. తమను కాంటాక్ట్ చేయాలని స్కామర్లు ఒత్తిడి తెచ్చినా వారి సూచించిన నెంబర్‌కు కాల్ చేసేందుకు డాక్టర్ నిరాకరించారు. స్కామర్ల బలవంతంతో అప్‌గ్రేడ్ పేరుతో స్కామర్లకు డాక్టర్ రూ. 10 చెల్లించారు. ఆపై నిందితులు పంపిన లింక్‌లో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా బాధితుఉ తనకు తెలియకుండానే డెబిట్ కార్డు వివరాలు వెల్లడించారు.
* టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్‌షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్‌కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్‌లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్‌లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు.
* గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్‌గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హెయిర్‌శాంపిల్స్‌లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z