“ఆటా” ఆధ్వర్యంలో వినూత్నంగా మహిళలు ప్రతి రంగంలో రాణించాలి అనే ఉద్దేశంతో ‘#ఇన్స్పిరేఇంక్లూషన్’ థీమ్ తో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 9వ తారీఖున ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో యాక్సంచర్ గ్లోబల్ ఎండీ రేవతి సుబ్రమణియన్ , బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తదితరులు పాల్గొంటారని ఉమెన్స్ చైర్ ప్రవీణ అంబటి ఒక ప్రకటనలో తెలిపారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆటా కార్యవర్గం తరపున మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z