Business

72వేలకు బంగారం ధర-BusinessNews-Mar 08 2024

72వేలకు బంగారం ధర-BusinessNews-Mar 08 2024

* ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక‌తో ముఖ్యంగా ఐటీ ప‌రిశ్ర‌మ‌లో కొలువుల కోత‌పై ఆందోళ‌న నెల‌కొంది. మ‌నుషులు చేసే ఉద్యోగాల‌ను ఏఐ రీప్లేస్ చేస్తుంద‌నే భ‌యాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్‌తో ఐటీ ప‌రిశ్ర‌మ‌లో సిబ్బంది అవ‌స‌రాల‌ను 70 శాతం త‌గ్గించ‌వ‌చ్చ‌ని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో బాంబు పేల్చారు. ఆటోమేష‌న్‌తో మాస్ లేఆఫ్స్ త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బ‌దులు ప్ర‌స్తుత ఉద్యోగుల నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చాల‌ని సూచించారు.

* బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న పుత్తడి విలువ.. ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాములు రూ.72,000 పలుకుతుందన్న అంచనా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దేశ, విదేశీ స్టాక్‌ మార్కెట్ల తీరుతెన్నులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకుల విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు, డాలర్‌ ఇండెక్స్‌, భారత్‌సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు.. కలిసి పసిడి ధరల్ని ఎగదోయవచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు వస్తున్నాయి.

* ఆర్ధిక మంద‌గ‌మ‌నం, వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు, పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌, సామ‌ర్ధ్యం ఇలా పేరేదైనా ఏదో ఓ సాకుతో టెక్ దిగ్గ‌జాలు ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ గ‌త ఏడాది సామ‌ర్ధ్యంపై కంపెనీ దృష్టి సారిస్తుంద‌ని చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం ప‌లు మార్పుల‌కు దారితీస్తోంది. మెటా సామ‌ర్ధ్య సంవ‌త్స‌రం కాస్తా ఉద్యోగుల‌పై వేటుకు దారితీయ‌డం టెకీల్లో గుబులు రేపుతోంది. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ టీం 50 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌తో పాటు దాని కార్య‌క‌లాపాల పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా లేఆఫ్స్‌కు తెగ‌బ‌డిన‌ట్టు చెబుతున్నారు. లేఆఫ్స్‌పై వ్యాఖ్యానించేందుకు తిర‌స్క‌రించిన మెటా ప్ర‌తినిధి కంపెనీ చేప‌ట్టిన సామ‌ర్ధ్య స‌మీక్ష కొన‌సాగుతోంద‌ని వెల్ల‌డించార‌ని బిజినెస్ ఇన్‌సైడ‌ర్ రిపోర్ట్ పేర్కొంది. జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించిన సామ‌ర్ధ్య ఏడాది కాస్తా వేలాది కొలువుల కోత‌కు దారితీయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

* క్రూ మెంబర్లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఓ ప్రముఖ కంపెనీ ఛైర్‌‌‌‌పర్సన్‌‌ను సైతం విమానంలో నుంచి దించేసిన ఘటన ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేటుచేసుకుంది. రెలిగేర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ ఛైర్‌‌‌‌పర్సన్‌‌ రష్మీ సలుజా దిల్లీ నుంచి లండన్‌ వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల ఎయిరిండియా విమానం ఎక్కారు. అయితే విమానంలోని క్రూ మెంబర్లతో ఆమె దరుసుగా వాదించడంతో తనను దిల్లీ ఎయిర్‌‌‌‌పోర్టులోనే దించేసినట్లు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లండన్‌‌ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఓ మహిళా ప్యాసింజర్‌‌‌‌ను దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ, విమాన సిబ్బంది ప్యాసింజర్‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై రష్మీ సలుజా కూడా స్పందించలేదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z