కేంద్ర ప్రభుత్వోద్యోగులు, సాఫ్ట్ వేర్ రంగ ఉద్యోగుల మాదిరిగానే బ్యాంకింగ్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు త్వరలో అమలులోకి రానున్నాయి. మరోవైపు, బ్యాంకు ఉద్యోగుల వేతనం పెంచడానికి బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య అంగీకారం కుదిరింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెంచడానికి, ఉద్యోగ సంఘాలు, ఐబీఏ మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తున్నది. 2022 నవంబర్ నుంచి బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు పెరుగనున్నాయి. దీనివల్ల సుమారు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ.8,284 కోట్ల భారం పడుతుందని తెలుస్తున్నది. ఇక ప్రతి నెలలో అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించడానికి ఉమ్మడి అంగీకారం కుదిరిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నది. ఈ విషయమై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేశాక కొత్త పని వేళలు అమలులోకి వస్తాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z