* మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు (Drugs Trafficking Case)లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ (Jaffer Sadiq)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసింది. గత నాలుగు నెలలుగా పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ శనివారం వెల్లడించింది.
* జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి విడిపోయింది. చంద్రశేఖర్ అలియాస్ సిద్ధుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. తండ్రి వద్ద పిల్లలు ఉంటుండగా.. దసరా పండుగకు తల్లి ఇంటికి బాలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై సిద్ధు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దసరా నుంచి వేధింపులు సాగుతుండటంతో తాళలేక బాధితురాలు తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
* ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తోంది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.
* అహ్మదాబాద్ | పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో ఒక వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. (Doctor’s body) ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. లేడీ డాక్టర్ సూసైడ్ నోట్‌లో ఒక పోలీస్ అధికారి పేరు ఉందని పోలీసులు వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోని బెంచ్‌పై ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సమీపంలో సిరంజ్‌లు ఉండటంతో విష ఇంజక్షన్ ద్వారా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. మృతురాలిని డాక్టర్ వైశాలి జోషిగా గుర్తించారు. పీజీ రెసిడెంట్ డాక్టర్ అయిన ఆమె అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.
* విడిపోయిన భార్యకు గుణపాఠం చెప్పేందుకు ఒక వ్యక్తి తన కుమారుడ్ని హత్య చేశాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న కొడుకును కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. కుమారుడ్ని చంపేందుకు ఆ తండ్రి మూడు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (Delhi father killed gym trainer son) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 6 అర్ధ రాత్రి వేళ 54 ఏళ్ల రంగ్ లాల్ తన కుమారుడైన 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్‌తో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తండ్రి చెంపపై గౌరవ్ కొట్టాడు. ఆగ్రహించిన రంగ్ లాల్ తన కుమారుడ్ని కత్తితో 15 సార్లు పొడిచాడు. దీంతో రక్తం మడుగులో పడి గౌరవ్ సింఘాల్ చనిపోయాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z