NRI-NRT

సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శివరాత్రి

సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శివరాత్రి

సింగపూర్ లో తెలుగు బ్రాహ్మణులు సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి పలు ఆధ్యాత్మిక, సనాతన ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం నాడు శ్రీ అరసకేసరి శివాన్ మందిరము ప్రాంగణములో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు.

భారతదేశం నుండి తెప్పించిన పుట్టమన్నుతో పంచ లింగములను పార్థివ లింగములుగా రూపొందించారు. పంచ రుద్రులుకి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతో అలరించారు. తీర్ధ ప్రాసాదాలు అందజేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z