WorldWonders

ఇంటి గేటు మూయలేదని చెవి కొరికి మింగేసింది-CrimeNews-Mar 10 2024

ఇంటి గేటు మూయలేదని చెవి కొరికి మింగేసింది-CrimeNews-Mar 10 2024

* భార్య నగ్న వీడియోను స్నేహితులకు పంపించిన వ్యవహారంలో పోలీసులు గాలిస్తున్న నవవరుడు కోర్టులో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా ఏర్కాడు సెందిట్టు సమీపంలో ఉన్న కల్లకాడు ప్రాంతానికి చెందిన సెంథిల్‌ (23)కు కారిపట్టికి చెందిన 23 ఏళ్ల యువతిని ప్రేమించి గత నెల 17వ తేదీ కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. యువతి కోసం ఆమె కుటుంబసభ్యులు గాలిస్తున్నట్టు తెలిసి, యువతితో పాటు సెంథిల్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి, పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో ఆమె సెంథిల్‌తోనే ఉంటానని తెలపడంతో పోలీసులు అతనితో పంపించారు. గత వారం ఆమె సెంథిల్‌కు తెలియకుండా ఏర్కాడులో ఉన్న పుట్టింటికి వచ్చింది. అప్పుడు తన నగ్న చిత్రాన్ని సెంథిల్‌ అతని స్నేహితులకు పంపించినట్టు తెలిపి, వాపోయింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన సెంథిల్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ స్థితిలో వాళప్పాడి కోర్టులో సెంథిల్‌ లొంగిపోయాడు. అతన్ని 22వ తేదీ వరకు సేలం జైలుకు రిమాండ్‌కు తరలించారు.

* లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్‌ వ్యాపారి సుభాష్‌యాదవ్‌ను ఈడీ శనివారం(మార్చ్‌ 9) రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్‌యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాలు ముగిసిన తర్వాత సుభాష్‌యాదవ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో రూ.2.30కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇసుక అక్రమ మైనింగ్‌, అమ్మకాల ద్వారా రూ.161 కోట్లు ఆర్జించినట్లు సుభాష్‌యాదవ్‌కు చెందిన కంపెనీపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసింది.

* ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్‌ శ్వేత శనివారం హత్యకు గురైంది. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. హత్యకు సంబంధించి సెకండ్‌ క్రైమ్‌ సీన్‌ను పాయింట్‌ కుక్‌లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్‌ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపినతర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు. హత్య చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కాగా, శ్వేత భర్త, మూడేళ్ల కొడుకు హైదరాబాద్‌ వచ్చేశారు.

* మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో విషాదం చోటుచేసుకుంది. చిన్నారులు లోహిత (3), జశ్విత (1) అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు అనిల్‌, దేవి పరారీలో ఉన్నట్లు సమాచారం.

* హైదరాబాదీ మహిళ సౌదీ అరేబియాలో భర్త వేధింపులు తాళలేక తన ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుంచి పారిపోయి ఓ హోటల్‌లో తలదాచుకొంది. ఆమె వెంట తన భర్త ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న 17 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఈ మేరకు తన కూతురు, మనవళ్లను భారత్‌కు తిరిగి రప్పించాలని కోరుతూ ఆమె తల్లి శనివారం కేంద్ర విదేశాంగశాఖకు లేఖ రాశారు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన సబేరాబేగం కుమార్తె సబాబేగంకు గతంలో వివాహం కాగా కట్నం ఇవ్వలేదన్న కారణంతో భర్త వదిలేశాడు. దీంతో ఆమెకు మరో వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వారి ఇంటికి సమీపంలో నివసించే ముఖ్తాదీర్‌ బంగ్లాదేశ్‌కు చెందిన అలీహుస్సేన్‌ అజీజ్‌ ఉల్‌ రెహ్మాన్‌ను వారికి పరిచయం చేశాడు. సౌదీ అరేబియాలోని మక్కాలో వారిద్దరూ డ్రైవర్లుగా పనిచేసేవారు.

* ఫ్యామిలీ ఫంక్షన్‌లో మ్యూజిక్ ఆఫ్ చేసినందుకు అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. (Man Kills Brother For Turning Off Music) అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోట దాక్కున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మౌహర్‌ గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాకేష్‌ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్‌ ఏర్పాటు చేశాడు. సౌండ్ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేయగా 30 ఏళ్ల తమ్ముడు రాజ్‌కుమార్‌ కోల్‌ డ్యాన్స్‌ చేశాడు. కాగా, కొంతసేపటి తర్వాత మ్యూజిక్‌ సిస్టమ్‌ను రాకేష్‌ ఆఫ్‌ చేశాడు. అయితే మ్యూజిక్‌ ఆన్‌ చేయాలని, తాను డ్యాన్స్‌ కొనసాగిస్తానని రాజ్‌కుమార్ అన్నాడు. ఈ విషయంపై సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన రాజ్‌కుమార్‌ గొడ్డలితో అన్న రాకేష్‌ను నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కల్వర్టులో దాక్కున్న నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఓ వ్య‌క్తి హడావుడిలో త‌న నివాస‌ముంటున్న ఇంటి గేటు మూయ‌కుండా వెళ్లిపోయాడు. దీంతో అదే భ‌వ‌నంలో ఉంటున్న మ‌రో మ‌హిళ అత‌నితో గొడ‌వప‌డి చెవి కొరికేసింది. అనంత‌రం ఆ చెవి భాగాన్ని ఆమె మింగేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన రిక్షా పుల్ల‌ర్ రామ్‌వీర్ భ‌గేల్ మార్చి 4వ తేదీన త‌న కుమారుడిని ప‌రీక్ష‌కు తీసుకెళ్లేందుకు ఉద‌యం 6 గంట‌లకు ఇంట్లో నుంచి బ‌య‌ల్దేరాడు. హ‌డావుడిలో ఆ భ‌వ‌నం గేటు మూయ‌డం మ‌రిచిపోయాడు. అదే భ‌వనంలో ఉంటున్న రాఖీ అనే మ‌హిళ రామ్‌వీర్ ఇంటికి రాగానే అత‌నితో గొడ‌వ‌ప‌డింది. గేట్ ఎందుకు మూయ‌లేద‌ని ప్ర‌శ్నించింది. దీంతో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

* రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ‌లం బావుసాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. న‌లుగురు రైతులు క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. వీరిలో ఒక‌రు మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్క‌ల రోశ‌య్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించేందుకు న‌లుగురు రైతులు వ‌చ్చారు. బోరు మోటారు దించుతుండ‌గా.. న‌లుగురు రైతుల‌కు క‌రెంట్ షాక్ త‌గిలింది. అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిన ఈ న‌లుగురిని 108 అంబులెన్స్‌లో వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. న‌లుగురిలో ఒక‌రు మృతి చెందారు. క‌ర్నాల శ్రీనివాస్, క‌ర్నాల మ‌హిపాల్, పంబ‌ల రాజు అనే ముగ్గురు రైతుల ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుడిని పంబ‌ల భూమ‌య్య‌(33)గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z