* మావోయిస్టు నేత సంజయ్ దీపక్‌రావు కేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సంజయ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. మలేషియన్ టౌన్‌షిప్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల సమయంలో నకిలీ ఆధార్ కార్డులు, ల్యాప్‌టాప్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా జనవరిలో ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. యువకులను సంజయ్ మావోయిస్టు దళంలో చేర్పిస్తున్నట్లు గుర్తించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు కూడా సమకూర్చినట్లు గుర్తించామని అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పడమటి కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కోసం టెర్రర్ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు.
* రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డృడో) మరో ఘనత సాధించింది. ‘మిషన్ దివ్యాస్త్ర (ంఇస్సిఒన్ డివ్యస్త్ర)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (ఆగ్ని-5 ంఈఋవ్)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ణరెంద్ర ంఒది) హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ంఈఋవ్)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు.
* బ్రిటన్ (భ్రితైన్) యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ (ఖతె ంఇద్ద్లెతొన్) అనారోగ్యానికి గురైన దగ్గరి నుంచి పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో గందరగోళానికి దారితీసింది. దాంతో ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆప్ వేల్స్ ఎక్స్(గతంలో ట్విటర్) వేదికగా ఆమె స్పష్టత ఇచ్చారు. ‘‘ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ల వల్ల నేను కూడా ఎడిటింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటాను. నిన్న మేం షేర్ చేసిన ఫొటో వల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని పోస్టు పెట్టారు.
* లోక్‌సభ ఎన్నికల(ళొక్ శభ ఏలెచ్తిఒన్స్)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (ఛాఆ)’ అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం (ఛితిజెన్షిప్ ఆమెంద్మెంత్ ఆచ్త్)-2019 పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. దీనిప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేయడంతో అమలులోకి వచ్చినట్లైంది.
* తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ (సుర్య కిరన్) కన్నుమూశారు. గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన ‘సత్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఇద్దరి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సూర్యకిరణ్ ‘మాస్టర్’ సురేష్ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించారు.
* మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా?అని ప్రశ్నించారు. డ్రోన్ చిత్రాలు, గ్రీన్ మ్యాట్‌తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్ పేర్కొన్నారు.
* ఉండవల్లిలోని తెదేపా (ట్డ్ఫ్) అధినేత చంద్రబాబు (ఛంద్రబబు) నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుపై తెదేపా, భాజపా(భ్ఝ్ఫ్), జనసేన (ఝనసెన) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, భాజపా జాతీయ నేత బైజయంత్ పండా హాజరయ్యారు. చర్చల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
* ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ (ఈణ్డ్ వ్స్ ఏణ్ఘ్ 2024)లో భారత్ అన్ని విభాగాల్లో రాణించింది. 4-1 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి అపూర్వ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు పలు రికార్డులతో చెలరేగగా.. అత్యధిక సిక్స్‌లు నమోదైన టెస్టు సిరీస్‌గానూ ఇది చరిత్రలోకి ఎక్కింది. మొత్తం 102 సిక్స్‌లు నమోదు కాగా.. ఇంగ్లాండ్‌కే బజ్‌బాల్ ఆటను చూపించిన రోహిత్ సేన(టేం ఈందీ) అందులో 72 సిక్స్‌లు బాదింది.
* అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయం.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్క రోజు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్.. సోమవారం పులివెందుల పట్టణ, నియోజకవర్గ పరిధిలో రూ. 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు.
* ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z