Business

సుప్రీం ఆదేశాలతో దిగొచ్చిన SBI-BusinessNews-Mar 12 2024

సుప్రీం ఆదేశాలతో దిగొచ్చిన SBI-BusinessNews-Mar 12 2024

* ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది (Byjus Shuts All Offices). ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. బెంగళూరు నాలెడ్జ్ పార్కు‌లోని ఐబీసీ వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఆఫీసుల మూసివేత ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోందని తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువులు ముగిసిన వెంటనే ఎక్కడికక్కడ ఆఫీసులు మూసివేస్తున్నట్లు తెలిపాయి.

* గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగి వచ్చింది. జనవరి ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.10 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. జనవరిలో ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం. కానీ ఆర్బీఐ నాలుగు శాతం లోపు ఉండాలని ఆర్బీఐ భావిస్తున్నది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సోమవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆ తర్వాత కోలుకొని కోలుకున్నాయి. ప్రారంభంలో సూచీలు పడిపోయినా.. తిరిగి పుంజుకున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 73,516.42 పాయింట్ల వద్ద ట్రేడిండ్‌ మొదలైంది. ఇంట్రాడేలో కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. ఒక దశలో 74,004.16 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 165.32 పాయింట్ల లాభంతో 73,667.96 వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే నిఫ్టీ 22,335.70 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత 22,452.55 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది.

* సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎట్టకేలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీక)కి ఎస్‌బీఐ సమర్సించింది. 2 రోజుల్లో ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను ఈసీ తమ వెబ్‌సైట్‌లో పెట్టనుంది. కాగా మార్చి 12 సాయంత్రం వరకు ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌బీఐ ఎ న్నికల బాండ్ల వివరాలను ఈసీకు సమర్పించింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు గడువును పెంచాలని కోరుతూ ఎస్‌బీఐ చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మార్చి 12 పని వేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని కూడా సుప్రీంకోర్టు పోల్ ప్యానెల్‌ను ఆదేశించింది. ఎస్‌బీఐ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు హర్షించాయి.

* ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z