అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (జీ.టి.ఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు నిర్వహించిన లేడీస్ నైట్ ఉల్లాసంగా సాగింది. తల్లులుగా, భార్యలుగా, ఉద్యోగస్తులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళల సాధికారతను ఈ సందర్భంగా కొనియాడారు.
రెండవ తరం భారతీయ సంతతికి చెందిన జిల్లా జడ్జి, జస్టిస్ షాలినా కుమార్ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళల అందించిన ఎనలేని సేవలను, కనపరిచిన విశేష ప్రతిభా పాటవాలను శ్లాఘించారు. మహిళలు తమ అవకాశాలను పొందకుండా ఉన్న అడ్డంకులు అన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని తొలగించాలని అన్నారు. ప్రొఫెసర్ పద్మజ నందిగామ కుటుంబం కోసం మగువ పడే కష్టానికి వెలకట్టలేమని అన్నారు.
ఫ్యాషన్ షో నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు అతిథులు ఆస్వాదించారు. శ్రీకాంత్ సందుగు పాటలు ఆహుతులను అలరించాయి. సాహిత్య వింజమూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కమిటీ సభ్యులు – సుష్మ పడుకోనె, స్వప్న చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిని బీరపు, అర్పిత భూమిరెడ్డి, కళ్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z