* హైదరాబాద్‌లోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సైదులు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసిన సైదులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఖాతాదారులకు తెలియకుండా 2.80 కోట్లను కాజేశాడు. ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు.. మరో షాకింగ్ విషయం తెలిసింది. సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్‌లో పనిచేసినప్పుడు కూడా ఇదే తరహా మోసానికి పాల్పడి సుమారు రూ.10 కోట్లు కొట్టేసినట్లు బయటపడింది. ఈ విషయం తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో షేక్ సైదులు హైదరాబాద్‌లోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో గంగ మల్లయ్య అనే మరో బ్యాంక్ ఉద్యోగి సహాయంతో ఖాతాదారులకు తెలియకుండా వాళ్ల డాక్యుమెంట్లు తీసుకుని లోన్లు అప్లై చేశాడు. 19 మంది పేరిట నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ.2.80 కోట్లను కాజేశాడు. అయితే రామంతపూర్ బ్రాంచ్ నుంచి సైదులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త మేనేజర్ రావడంతో వీళ్లు చేసిన మోసం బయటపడింది. దీంతో సైదులుపై కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలియడంతో భార్య, కొడుకుతో కలిసి మేనేజర్ సైదులు పరారయ్యాడు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. గతంలో కూడా ఇలాంటి మోసాలు చేశారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఈ క్రమంలోనే సూర్యాపేటలోనూ ఇదే తరహా మోసం చేసి రూ. 10 కోట్లు కొట్టేసినట్లు తెలిసింది.
* పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన కృష్ణ వర్ధన్ రెడ్డి గద్వాలలో నివాసం ఉంటున్నాడు. వారి సోదరుడు కుమారుని పెళ్లి జిల్లా కేంద్రంలోని ఎస్వీ హెవెంటాలో నిర్వహించారు. రాత్రి ఫంక్షన్ అయినా అనంతరం కుటుంబ సభ్యులతో ఫంక్షన్ హాల్ లోనే నిద్రించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫంక్షన్ హాల్లోకి చొరబడి బంగారు నగలు ఉన్న బ్యాగును తీసుకెళ్లారు. ఉదయం లేచిన అనంతరం బంగారం కలిగి ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో పట్టణ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
* వివరాల్లోకి వెళ్తే.. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లకు చెందిన ఇందుమతి(26) కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తనువు చాలించాలని భావించింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని.. బుధవారం ఉదయం విషం (కల్లాపి పౌడర్) తాగింది. ఇంతలోనే తన మూడు నెలల చిన్నారి గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. దీంతో తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి పాలుపట్టింది. అప్పటికే విషం ఇందుమతి శరీరం మొత్తం పాకడంతో.. పాల ద్వారా చిన్నారి శరీరంలోకి కూడా విషం ఎక్కింది. దీంతో తల్లీబిడ్డలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. అయితే కొంతకాలంగా ఇందుమతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ప్రేమ వ్యవహారంపై వాగ్వాదం నేపథ్యంలో కుమార్తె గొంతు నొక్కి తల్లి చంపింది. (Woman Murders Daughter) అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. వైద్య పరీక్షలో అసలు విషయం తెలియడంతో యువతి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బాంద్రాలో నివసిస్తున్న 40 ఏళ్ల టీనా బాగ్డే తన 19 ఏళ్ల కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆమెను నిలదీసింది. ఈ సందర్భంగా తల్లీకుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లి చేతిని కూతురు కొరికింది. ఆగ్రహించిన తల్లి, కుమార్తె గొంతు నొక్కడంతో ఆమె చనిపోయింది. కాగా, కుటుంబ సభ్యులు ఆ యువతిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు ఫిట్స్ వచ్చి మూర్ఛపోయిందని డాక్టర్లకు చెప్పారు. అయితే గొంతు నొక్కి ఆ యువతిని హత్య చేసినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీంతో యువతి తల్లి టీనాను పోలీసులు ప్రశ్నించారు. ఆమె నిజం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని నాజర్‌పేటకు చెందిన శివశంకర్‌రావు, నాగమణి దంపతులు . వీరికి హారిక అనే కూతురు ఉంది. కూతురు వివాహానికి చేసిన అప్పులు(Debt) తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు . గమనించిన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య నాగమణి మృతి చెందింది. భర్త శివశంకర్‌రావు, కుమార్తె హారిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన అతను అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా లేదంటే ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా గోకుల్‌నగర్‌కు చెందిన భూక్య కృష్ణతేజ (29) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఈ నెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన కృష్ణతేజ రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకగా సోమవారం ఉదయం పలివేల్పుల దగ్గర ఎస్సారెస్పీ కాలువ పక్కన కృష్ణతేజ ద్విచక్ర వాహనం కనిపించింది. దాంతో కుటుంబసభ్యులు వెంటనే కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారులోని ఎస్సారెస్పీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన కేయూ పోలీసులు కృష్ణతేజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ మృతదేహం కృష్ణతేజదే అని నిర్ధారించారు. దాంతో కేయూ పోలీసులు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే కృష్ణతేజ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z