Business

PayTM FASTAG పనిచేయదు. కొత్తది తీసుకోవాలి-BusinessNews-Mar 13 2024

PayTM FASTAG పనిచేయదు. కొత్తది తీసుకోవాలి-BusinessNews-Mar 13 2024

* పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్‌ వాడుతున్న వారంతా కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో కోరింది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు, ప్రయాణం సులభతరం చేసేందుకు ఈ నెల 15లోగా ఏదైనా బ్యాంకు నుంచి కొత్తగా ఫాస్టాగ్‌ తీసుకోవాలని చెప్పింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్‌పై ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ నెల 15 తర్వాత అన్ని క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్లను నిలిపివేయాలని చెప్పింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఫాస్టాగ్‌ అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకును తొలగించింన విషయం విధితమే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన ఆంక్షల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్టాగ్‌ వినియోగదారులు రీఛార్జ్‌ చేసేందుకు అవకాశం లేదని తెలిపింది. గడువు తర్వాత కూడా వినియోగదారులు టోల్ చెల్లించడానికి ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే అధీకృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాలయ్యాయి. సెన్సెక్‌ 72వేల పాయింట్లకు దిగజారి.. నిఫ్టీ 22వేలకు పతనమైంది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ బుధవారం లాభాలతో 73,993.40 పాయింట్ల వద్ద మొదలైంది. సూచీలు గరిష్ఠ స్థాయిలో కొనుసాగుతుండడంతో మదుపరులు అమ్మకాలకు దిగారు. దాంతో సూచీలు ఒక్కసారిగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో 74,052.75 పాయింట్లకు పెరగ్గా.. ఇంట్రాడేలో 72,515.71 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్దకు పడిపోయింది.

* జ‌స్ట్ సింగిల్ ప్రాంప్ట్‌తో కోడ్స్ రాయ‌డం, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయ‌డం, సాఫ్ట్‌వేర్ రూపొందించ‌డం వంటి నైపుణ్యాల‌తో కూడిన ప్ర‌పంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ డెవిన్‌ను టెక్ కంపెనీ కాగ్నిష‌న్ ప్ర‌వేశ‌పెట్టింది. మీరు ఏం అడిగితే అది చేసేయ‌గ‌ల సామర్ధ్యం డెవిన్‌కు సొంతం. అయితే ఈ ఏఐ టూల్ మాన‌వ ఇంజ‌నీర్ల‌ను రీప్లేస్ చేసే ఉద్దేశంతో రాలేద‌ని, హ్య‌మ‌న్ ఇంజ‌నీర్ల‌తో క‌లిసి ప‌నిచేసే విధంగా డిజైన్ చేయ‌బ‌డింద‌ని కాగ్నిష‌న్ చెబుతోంది. ఈరోజు తాము డెవిన్‌ను ప్ర‌వేశ‌పెడుతుండ‌టం ప‌ట్ల చాలా ఉత్సుక‌త‌తో ఉన్నామ‌ని, ఈ టూల్ ప్ర‌ముఖ ఏఐ కంపెనీల ప్రాక్టిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ ఇంట‌ర్వ్యూల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింద‌ని కంపెనీ తెలిపింది. ఇది త‌న కోడ్ ఎడిట‌ర్‌, వెబ్ బ్రౌజ‌ర్‌, షెల్ ద్వారా ఇంజనీరింగ్ టాస్క్‌ల‌ను స్వ‌యంగా చ‌క్క‌దిద్దుతుంద‌ని కాగ్నిష‌న్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. ముంద‌స్తుగా ఆలోచించ‌డం, సంక్లిష్ట టాస్క్‌ల‌ను ప్లాన్ చేయ‌డంలో అద్భుత‌మైన సామ‌ర్ధ్యం డెవిన్ క‌లిగిఉంది. ఇది వేలాది నిర్ణయాలు తీసుకోగ‌ల‌గ‌డంతో పాటు అది చేసే తప్పుల నుండి నేర్చుకోగలుగుతుంది. అదేమాదిరిగా కాల‌క్ర‌మేణా మెరుగుప‌డుతుంద‌ని కాగ్నిష‌న్ చెప్పుకొచ్చింది. ఆపై హ్యూమ‌న్ ఇంజ‌నీర్‌కు అవ‌స‌ర‌మైన కోడ్ ఎడిట‌ర్‌, బ్రౌజ‌ర్ వంటి అన్ని టూల్స్‌నూ ఇది క‌లిగిఉంది. ఎస్‌డ‌బ్ల్యూఈ-బెంచ్ కోడింగ్ బెంచ్‌మార్క్‌పై సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్ టాస్క్‌ల‌ను చ‌క్క‌దిద్దేందుకు డెవిన్ అద్భుత‌మైన‌, అత్యాధునిక సొల్యూష‌న్‌గా ముందుకొచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్ ప్రాబ్ల‌మ్స్‌కు సంబంధించిన స్టాండ‌ర్డ్ సెట్‌కు ఇత‌ర సొల్యూష‌న్స్‌తో పోలిస్తే ఈ టూల్ అద్భుతంగా ప‌నిచేసిన‌ట్టు వెల్ల‌డైంద‌ని కంపెనీ పేర్కొంది.

* ఐటీ ప‌రిశ్ర‌మ‌లో లేఆఫ్స్ ప్ర‌కంప‌న‌లు కొనసాగుతున్నాయి. టెక్ దిగ్గ‌జం ఐబీఎం రెండు విభాగాల్లో పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌పై వేటు వేయ‌నుంది. జాబ్ క‌ట్స్‌పై ఇప్ప‌టికే ప‌లువురు ఉద్యోగుల‌కు కంపెనీ స‌మాచారం అందించిన‌ట్టు స‌మాచారం. ఐబీఎం చీఫ్ క‌మ్యూనికేష‌న్స్ ఆఫీస‌ర్ జొనాథ‌న్ అద‌షెక్ ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని చెబుతున్నారు. లేటెస్ట్ లేఆఫ్స్‌లో కంపెనీ మార్కెటింగ్‌, క‌మ్యూనికేష‌న్ విభాగాల్లోని ఉద్యోగుల‌పై పెను ప్ర‌భావం ప‌డ‌నుంది. కంపెనీని వీడి వెళ్లాల‌ని కోరుకోని వారిని తొల‌గించ‌డం నిలిపివేసేందుకు కంపెనీని వీడాల‌నే ఆలోచ‌న ఉన్న వారు స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని ఐబీఎం ఇటీవ‌ల కోరిన అనంత‌రం తాజా లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల సంఖ్య‌ను కుదించే క్ర‌మంలో ఐబీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఏఐ టెక్నాల‌జీస్‌తో దాదాపు 8000 మంది ఉద్యోగుల‌ను రీప్లేస్ చేయాల‌ని కంపెనీ గ‌త ఆగ‌స్ట్‌లో కంపెనీ వెల్ల‌డించిన ప్ర‌ణాళిక‌లో భాగంగా ఏఐతో నిర్వ‌హ‌ణ సామ‌ర్ధ్యం పెంపు దిశ‌గా కంపెనీ లేటెస్ట్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డిన‌ట్టు భావిస్తున్నారు.

* కొద్దిరోజులుగా పరుగులు తీసిన బంగారం ధర మంగళవారం రాత్రి ప్రపంచ మార్కెట్లో దిగివచ్చింది. యూఎస్‌లో ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా పెరగడంతో ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా 20 డాలర్లకుపైగా పడిపోయింది. ఈ ప్రభావంతో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 420 మేర క్షీణించి రూ. 65,615 వద్దకు తగ్గింది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే బుధవారం ఇక్కడ స్పాట్‌ మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో అమెరికాలో 3.1 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకాగా, ఫిబ్రవరిలో ఇది మరింత పెరిగి 3.2 శాతానికి చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z