తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యాదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకుడు మన్నవ మోహనకృష్ణ భేటీ అయ్యారు.
చంద్రబాబునాయుడు మన్నవ మోహనకృష్ణతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీకు మంచి పేరుంది కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా బీసీ అభ్యర్థిని ఎంపిక చేయవల్సి వచ్చిందని వివరించారు. నేడు టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టికెట్ పిడుగురాళ్ల మాధవికి కేటాయించారు.
మోహనకృష్ణ అనేక సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి అమెరికాలోనూ, ఆంధ్రాలోనూ అంకితభావంతో సేవ చేస్తున్నారని, పార్టీకి ఆర్థికంగానే గాక అవసరమైన సమయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుందని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ గానీ, గుంటూరు నగర మేయర్ పదవి గానీ ఇస్తానని చంద్రబాబు మోహనకృష్ణకు హామీనిచ్చారు. తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలను చంద్రబాబు గుర్తించి అభినందించటం సంతోషంగా ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మంచి మెజారిటీతో గెలిపిస్తానని చంద్రబాబుకి తెలిపానని మన్నవ పేర్కొన్నారు. చంద్రబాబు హామీ పట్ల హర్షం వెలిబుచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z