NRI-NRT

అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషాభివృద్ధికి కృషి-కజకిస్తాన్‌లో యార్లగడ్డ

అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషాభివృద్ధికి కృషి-కజకిస్తాన్‌లో యార్లగడ్డ

అంతర్జాతీయ స్ధాయిలో హిందీ మనుగడను పెంపొందించేందకు కట్టుబడి ఉన్నామని విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. కజకిస్తాన్ దేశంలోని అల్ మి నగరంలో గురువారం నిర్వహించిన ప్రథమ హిందీ సమ్మేళనానికి యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు యూరేషియన్ దేశాల నుండి ప్రతినిధులు హాజరు కాగా, అక్కడి ఆల్ ఫరాబి విశ్వవిద్యాలయం, భారత విదేశాంగ శాఖ, వివేకానంద కల్చరల్ సెంటర్, భారత రాయబార కార్యాలయం సంయిక్తంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాయి.

ఈ సందర్భంగా అచార్య యార్లగడ్డ ప్రసంగిస్తూ విదేశాలలోని హిందీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇందుకు అయా దేశాలతోని విశ్వ హిందీ పరిషత్తు ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసిందని వివరించారు. అదే క్రమంలో విదేశాలలోని హిందీ అధ్యాపకులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, భారతీయ భాషగా హిందీ ఔన్నత్యాన్ని కాపాడేందుకు వీరు చేస్తున్న కృషి హర్షించదగినదన్నారు. అచ్చతెలుగు పంచె కట్టులో గురజాడ తెలుగు కవితల హిందీ అనువాదం చేస్తూ, సందర్భోచితంగా హిందీ కవుల కవితలను ప్రస్తావిస్తూ సాగిన అచార్య యార్లగడ్డ ప్రసంగం ఆకట్టుకుంది.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z