* సాదాసీదా కిరాణ దుకాణం నిర్వహించే ఓ మహిళ బ్యాంకు ఖాతాల్లో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నాయంటే నమ్ముతారా? నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తోన్న నీతూబాయి కుటుంబం ఎనిమిదేళ్లలో ఇలా సంపాదించినట్లు టీఎస్‌న్యాబ్ పోలీసులు గుర్తించారు. బుధవారం డెకాయ్ ఆపరేషన్‌లో నీతూబాయి, ఆమె భర్త మున్నుసింగ్(53), సమీప బంధువులు సురేఖ(38), మమత (50)తోపాటు 13 మంది గంజాయి వినియోగదారులు వెరసి మొత్తం 17మందిని అరెస్టు చేశారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి, నానక్‌రాంగూడకు చెందిన గౌతమ్‌సింగ్, నేహాబాయి పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నీతూబాయి, మున్నుసింగ్, ఇతర కుటుంబసభ్యులు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8 వేల చొప్పున కొని 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాల్లో నింపి రూ.500 అమ్ముతారు. అలా కిలో గంజాయి విక్రయాలతో రూ.50వేలు వంతు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో అంతా విలాసవంత జీవితం అనుభవిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థిర, చరాస్థులు కొనుగోలు చేశారు. గతేడాది ఆగస్టులో నీతూబాయి కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీయగా రూ.4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించి ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఆమె గంజాయి విక్రయాలు చేస్తూనే ఉంది.
* పార్ట్‌టైం జాబ్ పేరిట టాస్కులు చేస్తే డబ్బులిస్తామంటూ చెప్పిన మాటలు నమ్మి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్‌పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ పురపాలక పట్టణ పరిధి నవ్యనగర్ కాలనీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఫోన్‌కు గతనెల 26న ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్ అంటూ వచ్చిన లింకును క్లిక్ చేశాడు. దానిలో టాస్క్‌లు ఇచ్చారు. టాస్క్‌లు పూర్తి చేయాలంటే ఫీజు చెల్లించాలనడంతో రూ.2 వేలు కట్టాడు. కమీషన్ ఇచ్చి మళ్లీ కట్టమన్నారు. అలా రూ.31 లక్షలు కట్టాడు. తర్వాత స్పందన లేకపోవడంతో పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
* దేశ రాజధాని ఢిల్లీ (డెళి)లో ఇటీవలే వరుస అగ్నిప్రమాద ఘటనలు (Fఇరె ఈంచిదెంత్స్) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో ఫైర్ ఇన్సిడెంట్ ఘటనలు జరిగాయి. మొత్తంగా ఈ రెండున్నర నెలల్లోనే అగ్ని ప్రమాద ఘటనల కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. సుమారు 100 మందికిపైగానే ప్రజలు గాయపడినట్లు తెలిపారు.
* స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు పేర్కొన్నారు.
* ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలు నుంచి ఈ వీడియో ప్రసారమైనట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. రెండు నిమిషాల వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు. 2019లో రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
* ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం జరి గిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రొంటాల రమాదేవికి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త కరోనా సమ యంలో మృతి చెందాడు. కూతురు సౌమ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. రమాదేవి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం కొడుకును తీసుకుని ద్విచక్ర వాహ నంపై ములుగు ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి మృతి చెందగా…కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయాన్ని సౌమ్య కుటుంబ సభ్యులు కళాశాలకు తెలియజేశారు. అయితే సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవి ష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో…ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. గురువారం పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు. దీంతో అమ్మకేదో ఆపద వచ్చిందని భావించి ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z