* ఉజ్బెకిస్తాన్ మహిళ జరీనా(37) హత్య కేసులో రాబర్ట్, అమృత్ సోను అనే ఇద్దరిని బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్, విదేశీ కరెన్సీ కోసమే జరీనాను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హోట్‌ల్ సీసీటీవీ కెమరాల ఫుటేజిని పరిశీలించి కేసును పోలీసులు చేధించారు.
* ఈడీ సమన్ల కేసు వ్యవహారంలో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో ఇవాళ ఉదయం ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరవ్వగా.. పూచికత్తుల మీద ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. మార్చి 16న వ్యక్తిగతంగా హాజరవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన సమన్లపై కేజ్రీవాల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇవాళ ఆయన ఢిల్లీ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. అయితే.. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను ఆదేశించింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా తాము పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. అయితే వర్చువల్‌గా హాజరవుతానన్న ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
* అక్రమ మైనింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్‌చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్‌పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్‌చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్‌చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు.
* తనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్‌డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్‌డిస్కులను ధ్వంసం చేశారు. ఇదీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో డీఎస్పీగా పనిచేసిన సమయంలో దుగ్యాల ప్రణీత్‌రావు(40) విచ్చలవిడి అధికార దుర్వినియోగం. హైదరాబాద్ పోలీసులు ఈ నెల 13న న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ప్రణీత్ తన బృందంతో కలిసి 17 కంప్యూటర్ల ద్వారా ఈ తతంగానికి పాల్పడ్డారు. శాసనసభ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు హార్డ్‌డిస్కులు మాయం చేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. దస్త్రాలతోపాటు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ పనిలో అతడికి మరికొందరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
* కరీంనగర్ నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.6.65 కోట్లు పట్టుబడ్డాయి. హోటల్, బార్ అండ్ రెస్టారంట్, సినిమా హాళ్లలో సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి శనివారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z