DailyDose

17ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం-CrimeNews-Mar 17 2024

17ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం-CrimeNews-Mar 17 2024

* రథోత్సవానికి హాజరైన యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఒక చోటకు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Teen gang raped) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 9న 17 ఏళ్ల యువతి వెల్లకోవిల్‌లోని వీరకుమారస్వామి రథోత్సవాన్ని చూసేందుకు అక్కడకు వెళ్లింది. కాగా, ఏడుగురు వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్‌ చేశారు. ఒక ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

* ఏపీలో ఆదివారం బస్సు బోల్తా పడి(Bus overturn) 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. పుట్టు వెంట్రుకల మొక్కును తీర్చుకునేందుకు బాపట్ల జిల్లా తాళ్తూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన 60 మంది ప్రైవేట్‌ బస్సులో కోటప్పకొండకు బయలు దేరారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద బస్సు కట్టర్‌ (Bus Cutter) విరిగిపోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ప్రైవేట్‌ వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరిని ఒంగోలు రిమ్స్‌ (Ongle Rims) ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

* ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్తకు ఆగంతకుల నుంచి స్వీట్ బాక్స్ తోపాటు బుల్లెట్లు, ఒక బెదిరింపు లేఖ అందింది. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో నివసిస్తున్న వ్యాపారవేత్త ఇంటి బయట ఒక స్వీట్ బాక్స్, బెదిరింపు లేఖ, రెండు లైవ్ క్యాట్రిడ్జ్ (బుల్లెట్లు) లు దొరికాయని పోలీసులు శనివారం తెలిపారు. ఈ విషయమై గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీలోని 506 సెక్షన్, ఆయుధాల చట్టంలోని 25 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని చెప్పారు. బాక్స్ చూసిన తర్వాత సదరు వ్యాపార వేత్త స్థానిక పోలీసులను ఆశ్రయించారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

* మహారాష్ట్రలోని పుణె సిటీ సమీపంలో గల ఓ హోటల్‌లో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. పుణె-సోలాపూర్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్‌లో అవినాష్‌ దాన్వే అనే వ్యక్తిని కొందరు దుండగులు పిస్టల్‌తో కాల్చి, వేట కత్తులతో నరికి దారుణంగా చంపేశారు. ధాన్వే స్నేహితుల ముందే ఈ హత్య జరిగింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

* ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఆదివారం ఒకే రోజు కేజ్రీవాల్‌కు రెండు కేసుల్లో ఈడీ సమన్లు పంపడం కలకలం రేపుతోంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో తొమ్మిదోసారి సమన్లు జారీ చేయగా ఢిల్లీ జల్‌ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని మరో సమన్లు పంపింది. లిక్కర్‌ కేసులో మార్చ్‌ 21 విచారణకు పిలవగా, జల్‌ బోర్డు కేసులో 18న రావాలని ఈడీ కోరింది. కాగా, లిక్కర్‌ కేసులో విచారణ కోసం గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించలేదు. విచారణకు హాజరవలేదు. దీంతో ఈడీ ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే సమన్లకు స్పందించని కేసులో కేజ్రీవాల్‌కు శనివారమే(మార్చ్‌ 16) కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్‌ తీసుకున్న మరుసటి రోజే లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు పంపడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z