Food

పీచు మిఠాయిపై నిషేధం

పీచు మిఠాయిపై నిషేధం

పీచు మిఠాయి (Cotton Candy).. ఈ పేరు విన‌గానే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. అలా నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ పీచు పిఠాయిని తినేందుకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఆస‌క్తి చూపుతారు. అలాంటి పీచు మిఠాయిపై ఇటీవలే పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. పీచు మిఠాయి తయారీకి ఉప‌యోగించే వాటిలో క్యాన్సర్‌కార‌క ర‌సాయ‌నాలు ఉన్నట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలడంతో వాటి విక్రయాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే బ్యాన్‌ విధించాయి. ఇప్పుడు తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌కూడా ఈ పీచుమిఠాయిని నిషేధించింది.

దీని తయారీ, నిల్వ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ( Health and Family Welfare). ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 2025 మే 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z