NRI-NRT

NRI-OCIలకు ఆధార్ ఇలా అప్లై చేసుకోవచ్చు

NRI-OCIలకు ఆధార్ ఇలా అప్లై చేసుకోవచ్చు

ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్‌రోల్ చేసుకోవచ్చు.

ఎన్‌ఆర్‌ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి.

ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి.

ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి.

భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు

నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్‌లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి.

18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది.

ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్‌లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z