Politics

25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా-NewsRoundup-Mar 18 2024

25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా-NewsRoundup-Mar 18 2024

* ప్రముఖ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ (Sadananda Gowda) భాజపా (BJP)ను వీడనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అలాగే ఆయన కాంగ్రెస్‌లో చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ కేంద్ర మాజీ మంత్రి స్పందించారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని పేర్కొన్నారు. దాంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.

* ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యముందని, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈవోకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.

* ఐపీఎల్‌ 17వ (IPL) సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వ్యాఖ్యానించాడు. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాండ్య మాట్లాడాడు. రోహిత్ శర్మతో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో హిట్‌మ్యాన్‌ ఆడటం ఇబ్బందేమీపడకపోవచ్చని హార్దిక్ తెలిపాడు. ఈ సీజన్‌లో అతడి సాయంతో జట్టును విజయాల బాట పట్టిస్తాననే నమ్మకం ఉందన్నాడు. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి తొలి మ్యాచ్‌ ఆడనుంది.

* తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) స్పందించారు. ‘‘ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు

* తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది.

* ‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) తాజాగా స్పందిస్తూ విపక్షాలను ఎండగట్టారు. ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

* కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్‌ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి తమకు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.

* ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.

* బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్‌ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

* లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

* కరోనా సంక్షోభం సమసిపోవటంతో టెక్ కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని అల్టిమేటం జారీ చేశాయి. అయినప్పటికీ.. కొందరు ఇంకా ఇంటినుంచి పనికే మొగ్గు చూపుతున్నారు.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం (Election Commission) కొరడా ఝళిపించింది. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

* ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. గతేడాది నవంబరులో ఆయన కొడుకు రోహన్‌ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌లకు ఏకాగ్రహ్ జన్మించాడు.

* వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మియాపూర్‌, చందానగర్‌సహా పలుచోట్ల వర్షం కురిసింది.

* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించిన సీనియర్ లీడర్ని తాను కాదని భాజపా నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ (Ashok Chavan) అన్నారు. రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీతో భేటీ కాలేదని స్పష్టం చేశారు. ఆదివారం ముంబయిలో జరిగిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు. మహరాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించే అని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.

* సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్ఠానం.. ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కడప లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం (Election Commission) కొరడా ఝళిపించింది. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌ డీజీపీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

* ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని సభలో జరిగిన తొక్కిసలాట, రభసే ఇందుకు నిదర్శనం. ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరడం, వేదిక ముందు తోపులాట చోటుచేసుకున్నా పట్టించుకోలేదు. వీవీఐపీ, మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకువచ్చి తోపులాటకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. జనాన్ని నియంత్రించాలని ప్రధానమంత్రే చెప్పినా పోలీసుల్లో స్పందన లేదు. ప్రజలు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్నా పోలీసులు వారికి దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశమార్గం వద్దకు పంపారు. ఇక్కడ అందరూ గుమిగూడటం, పాసులు ఉన్నవారు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీవీఐపీలు సైతం బయటపడటానికి నానా అవస్థలు పడ్డారు. సభలోకి వెళ్లలేక వెనక్కి వచ్చి సాధారణ జనం ఉన్న గ్యాలరీల్లో కూర్చోవాల్సి వచ్చింది. కొందరు నేతలు వెనక్కి వచ్చేటప్పటికి గ్యాలరీలు నిండిపోవడంతో రోడ్డుపైనే నిలబడిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుని సభకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పోలీసులు జనానికి సహకరించకపోగా ఉద్దేశపూర్వకంగా పలు ఇబ్బందులకు గురిచేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z