* ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న పోలీస్‌ను (Encounter Specialist ) చైన్ స్నాచర్లు టార్గెట్ చేశారు. గన్ చూపించి ఆయన మెడలోని గోల్డ్ చైన్ తీసి ఇవ్వాలని బెదిరించారు. అలాగే గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పోలీస్ అధికారి ఎదురుదాడి చేసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన వినోద్ బడోలా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుపొందారు. పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న ఆయన కేంద్ర హోంమంత్రి నుంచి ప్రత్యేక మెడల్ కూడా అందుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఆయనకు నైపుణ్యం ఉంది.
* నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రస్తుతం క్రైమ్ జీపీటీని వాడుతున్నారు. స్టేక్ టెక్నాలజీస్ యూపీ ప్రభుత్వం, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో ఈ న్యూ టూల్‌ను క్రియేట్ చేసింది. నేరగాళ్ల డిజిటల్ డేటా బేస్‌ను తనిఖీ చేస్తూ క్రైమ్ జీపీటీ పనిచేస్తుంది. రాతపూర్వక, స్పోకెన్ క్వశ్చన్స్ ద్వారా నిర్ధిష్ట వ్యక్తుల గురించిన సమాచారం ఇది వేగంగా రాబడుతుంది. ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్, క్రిమినల్ గ్యాంగ్‌ల విశ్లేషణ వంటి ఫీచర్లను క్రైమ్ జీపీటీ కలిగిఉంది. స్టేక్ టెక్నాలజీస్ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో అతుల్ రాయ్ ఈ టూల్ పనితీరును వివరించారు. సాంకేతికతతో భద్రతను కట్టుదిట్టం చేయాలనే తమ కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా క్రైమ్ జీపీటీని అబివృద్ధి చేశామని రాయ్ తెలిపారు.
* పరీక్షల విధుల్లో ఉన్న స్కూల్ టీచర్‌ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్‌ను హత్య చేశాడు. (School Teacher Shot Dead By Cop) ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారణాసికి చెందిన విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి పోలీస్ భద్రత మధ్య బోర్డ్ హైస్కూల్ పరీక్షల జవాబు పత్రాలను పలు కాలేజీలకు వాహనంలో తరలించారు. ఆదివారం రాత్రి చివరగా ముజాఫర్‌నగర్‌లోని కాలేజీకి వాటిని తీసుకువచ్చారు. కాగా, వాహనంలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాష్ మద్యం సేవించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ధర్మేంద్ర కుమార్‌ను పొగాకు అడిగాడు. ఆ టీచర్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో ధర్మేంద్ర కుమార్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
* దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్‌కోట్‌లో వెలుగు చూసింది. భగల్‌కోట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ 14 ఏండ్ల విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక రూ. 2 వేలు దొంగిలించినట్లు టీచర్ జయశ్రీ మిశ్రికోటి వేధించింది. హెడ్‌మాస్టర్ కేహెచ్ ముజావర్ కూడా బాలికను నిందించాడు. హెడ్‌మాస్టర్, టీచర్ వేధింపులు భరించలేక విద్యార్థినిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z