* ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్, బీజేపీ తరఫున బరిలో ఎవరు నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును చాన్నాళ్ల క్రితమే ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. త్వరలోనే అన్ని స్థానాల అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా వెల్లడించగా.. గురువారం ఐదు స్థానాలకు ప్రకటించారు. ఆ జాబితాలో ఖమ్మం లేకపోవడంతో ఆశావహుల అనుచరులు ఎవరికి వారు తమ నేతే అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
* అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు.
* సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్‌లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్‌ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు.
* తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను టీడీపీ, జనసేనలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. లోకల్ ముద్దు – నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ- జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు వద్దకు తిరుపతి పంచాయితీ చేరింది. మరోవైపు, టికెట్ ఇస్తే జనసేన నుంచి పోటీకి సిద్ధమని సుగుణమ్మ అంటున్నారు.
* లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్‌నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది.
* ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది.
* ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈనెల 19న ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్.. గుంటూరు గ్రామీణ మండల పరిధిలోని వాలంటీర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారిని ప్రలోభ పెట్టేందుకు నగదుతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. బలసాని.. వాలంటీర్లతో సమావేశమైన విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరులో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రలోభాల పర్వంపై ఫిర్యాదులు అందడంతో ఈసీ స్పందించింది. నగర పాలక సంస్థల పరిధిలోని 12 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
* ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం వైకాపా నేతలకు అడ్డాగా నిలిచింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యానాదయ్య దేవస్థానం కేశఖండనశాలలో క్షురకులను కలిసి వైకాపాకు ఓటు వేసి జగన్‌ను గెలిపించాలని కోరారు. వైకాపా సిద్ధం పేరుతో ఉన్న కరపత్రాలను వారికి పంపిణీ చేశారు. ఆలయంలో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో స్పందించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఈవో వైకాపాకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైకాపా ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు దేవస్థానంలో భోజనాలు ఏర్పాటు చేయడంపై ఈవో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఉన్నతాధికారులు ఈవోను బదిలీ చేసినా వైకాపా నేతల అండదండలతో రద్దు చేయించుకోగలిగారు. ఈ కారణంగానే వెంకన్న క్షేత్రంలో వైకాపాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈవో నోరు మెదపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేశఖండనశాలలో వైకాపా కరపత్రాలు పంచిన విషయం తన దృష్టికి రాలేదని ఈవో చెప్పడం గమనార్హం.
* తెదేపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది. తెదేపా మూడో జాబితా విడుదల చేసిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరినట్లు తెలిపారు. పార్లమెంటులో బలమైన గళం వినిపించి రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..
పలాస-గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవిందరావు
శ్రీకాకుళం-గొండు శంకర్
శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు-బోడె ప్రసాద్
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
లోక్‌సభ స్థానాల అభ్యర్థులు..
శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
అమలాపురం- గంటి హరీష్
ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపురం- బీకే పార్థసారథి
* కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడకు కారులో వస్తూ గన్నవరంలో వైకాపా ఫ్లెక్సీలను గమనించారు. ఫొటోలు తీసి ఫ్లెక్సీల విషయం సీ-విజిల్ యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీ వర్గీయులు ఆమెపై దాడికి యత్నించారు. మాధవి కారు కదలనీయకుండా వాహనాలు అడ్డుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.
* తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి నాగర్‌కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తన మీద సోషల్‌మీడియా వేదికగా కొన్ని శక్తులు ( కొంతమంది ఆప్తులతో సహా ) తీవ్రమైన దాడి చేశాయని.. ఇంకా చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని తెలిపారు. పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యం నుంచి తనను ఈ చిల్లర రాజకీయాలు దూరం చేయలేవని స్పష్టం చేశారు. తన మీద నమ్మకంతో నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
* లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. కేజ్రీవాత్ గతంలో చేసిన పనులకు సంబంధించిన పరిణామాలను ఎదుర్కొంటున్నారని ఆయనను కర్మ వెంటాడిందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ గతంలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలపై నిరాధార, బాధ్యతారాహిత్య ఆరోపణలు చేశారని శర్మిష్ట గుర్తుచేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో జరుగబోయే ఎన్నికల్లో టికెట్లు లభించని నాయకులు ఆయా పార్టీల తీరుపై తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యిందని ’ పేర్కొంటు బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే కత్తి సింబల్‌తో ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రెండు సంవత్సరాల క్రితం సీఎం జగన్ విధానాలు నచ్చక టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ స్థానమైన తిరువూరు గాని, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా గాని చంద్రబాబు ప్రకటిస్తారని భావించిన ఆమెకు నిరాశే ఎదురయ్యింది. శుక్రవారం చంద్రంబాబు ప్రకటించిన మూడో జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనై వినూత్నంగా నిరసన తెలుపుతూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
* మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి (Excise policy Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు.
* ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కు తెలంగాణ హైకోర్టు (TS High Court) నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ భారాస నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z