* తండ్రితో గొడవ నేపథ్యంలో ఆగ్రహించిన కొడుకు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టాడు. (Man Kills Father, Buries In House) తండ్రి కనిపించకపోవడంపై మిగతా సోదరులు అతడ్ని ప్రశ్నించాడు. తొలుత తనకు తెలియదన్న ఆ వ్యక్తి చివరకు తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల రాజేంగ్ బరాండాకు నలుగురు కుమారులు. పెద్ద కొడకు ప్రకాష్ తన తల్లితో కలిసి అహ్మదాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరు కుమారులైన దినేష్, పప్పు బల్వారా గ్రామంలో ఉంటున్నారు. చిన్న కుమారుడు చున్నీలాల్ వేరుగా ఉంటున్న ఇంట్లో తండ్రి కూడా నివసిస్తున్నాడు. కాగా, ఈ నెల 20న చిన్న కుమారుడు చున్నీ లాల్ తన తండ్రి రాజేంగ్‌తో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు పదునైన ఆయుధంతో తండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి ప్రాంగణంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే తండ్రి రాజేంగ్ రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుమారులు దినేష్, పప్పు ఆందోళన చెందారు. అహ్మదాబాద్‌లో ఉంటున్న అన్న ప్రకాష్‌కు ఈ విషయం చెప్పారు. మరోవైపు ప్రకాష్ హుటాహుటిన సొంత గ్రామానికి వచ్చాడు. తమ్ముడు చున్నీ లాల్‌ను తండ్రి గురించి ఆరా తీశాడు. అయితే తండ్రి ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదంటూ చున్నీ లాల్ తొలుత బుకాయించాడు. సోదరులు గట్టిగా నిలదీయడంతో తండ్రిని చంపినట్లు చివరకు ఒప్పుకున్నాడు. దీంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి ప్రాంగణంలో పాతిన మృతదేహాన్ని వెలికితీశారు. చున్నీ లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* పోలీస్ అధికారి కుమారుడు ఒక హోటల్‌లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నాడు. (Cop’s Son Running Prostitution Racket) ఈ విషయం తెలుసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విటులుగా నటించారు. డబ్బులు తీసుకున్న పోలీస్ అధికారి కొడుకుతోపాటు వ్యభిచార దందాలో అతడికి సహకరిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. విశ్వాస్ వెజ్ హోటల్‌లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. మార్చి 21న ఒక ఏజెంట్ కొందరు మహిళలను ఆ హోటల్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది.
* ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. (Death Penalty) నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2022 ఆగస్ట్‌లో మావల్ తాలూకాలోని కమ్‌షెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఒక ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కత్తితో గొంతు కోసి ఆ చిన్నారిని హత్య చేశాడు. ఇంటి వెనుక చెట్టు కింద గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. కాగా, బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడి ఇంటి వెనుక పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడితోపాటు అతడి దుస్తులు దాచి కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు 2022 అక్టోబర్‌లో ఈ కేసుపై విచారణను స్థానిక కోర్టు చేపట్టింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఎనిమిది నెలల్లో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది. నేరం జరిగిన ఒక సంవత్సరం ఏడు నెలల్లోనే శిక్షలు ఖరారు చేసింది. నిందితుడికి మరణ శిక్ష, సాక్ష్యాలను దాచి, పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు నిందితుడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్షను కోర్టు విధించింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
* ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Family Suicide) చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తల్లి పద్మావతి,కుమార్తె వినయ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఒంటిమిట్ట చెరువు పక్కనే రైలు కిందపడి పద్మావతి భర్త సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z