నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో “కాఫీ విత్ కాప్” కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారు తమ భద్రతకు తీసుకోవలసిన చర్యలను ఈ కార్యక్రమంలో ఎడిసన్ పోలీసులు వివరించారు. వివరించడం జరిగింది. ఎడిసన్ మేయర్, భారతీయుడైన శ్యామ్ జోషి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
పోలీసులు భద్రతాపరమైన సూచనలు చేశారు. దొంగతనాలు, దోపిడీల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఆగంతుకులు చేసే దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలి? సైబర్ దాడుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు ఆసక్తిగా హాజరయ్యారు. పలు అంశాలపై తమకున్న సందేహాలను పోలీసులు నడిగి నివృత్తి చేసుకున్నారు.
ఇలాంటి కార్యక్రమాన్ని న్యూజెర్సీలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు నాట్స్ ప్రణాళికలు చేస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి 50% రాయితీతో నాట్స్ సభ్యత్వాన్ని అందించారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీపీ రావు, బిందు ఎలమంచిలి, అడ్వైజరీ బోర్డ్ నుండి గంగాధర్ దేసు, నాట్స్ బోర్డు మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ మురళీకృష్ణ మేడిచర్ల, న్యూజెర్సీ చాఫ్టర్ కో-కోఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ భీమినేని, రమేష్ నూతలపాటి, వంశీ కొప్పురావూరి, విష్ణు ఆలూరు, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతిలు అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z