మేషం
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. వారం మధ్యలో కొన్ని చికాకులు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. పలుకుబడితో కార్యసిద్ధి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. సూర్యారాధన శుభప్రదం.
వృషభం
ఈ వారం అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచివారితో సాహచర్యం కలుగుతుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. శివాలయాన్ని సందర్శించండి.
మిథునం
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రారంభించిన పనులు నిదానంగా ముందుకుసాగుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, అవసరానికి డబ్బు అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. భూ లావాదేవీలకు వారాంతం అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం
ఈ వారం అనుకూల సమయం. సమయస్ఫూర్తితో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శివాలయాన్ని సందర్శించండి.
సింహం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. శుభకార్య విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి పెరుగుతుంది. అయితే అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. వారం మధ్య నుంచి పరిస్థితుల్లో అనుకూల మార్పు వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. దత్తాత్రేయస్వామి ఆరాధనతో మేలు జరుగుతుంది.
కన్య
ఉద్యోగులకు ఉన్నతమైన సమయం. బాధ్యతలు పెరిగినప్పటికీ, అందుకు తగ్గట్టుగా పనిచేస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, అనుకూల బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో స్వల్పచికాకులు ఉంటాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. బాల్య మిత్రులను కలుసుకుంటారు. వాహన మరమ్మతులు ముందుకురావొచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు రాబడతారు. తీర్థయాత్రలు చేపడతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
తుల
ఈ వారం తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఒత్తిడి ఉంటుంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
కొన్ని విషయాల్లో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు శుభ సమయం. అధికారుల మన్ననలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. దుర్గా స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు మంచి సమయం. సాహసంతో ముందుకువెళ్తారు. పనుల్లో విజయం సాధిస్తారు. సమయపాలన అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. చాలాకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
మకరం
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పరిచయాలు బాగా కలిసివస్తాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z