* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు కాన్వాయ్ ఆపి సోదాలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ పరిశీలించారు. వాహనం దిగి లోకేశ్ కూడా సహకరించారు.
* భారత్‌లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.
* సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సారథ్యంలో కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని ‘మెట్రోమ్యాన్ ’ శ్రీధరన్ (Metroman Sreedharan) విశ్వాసం వ్యక్తంచేశారు. కేరళలోనూ భాజపా(BJP) నాలుగైదు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఆదివారం ఆయన తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్రిస్సూరు నుంచి సురేశ్ గోపీ నూటికి నూరు శాతం గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్‌లు తిరువనంతపురం, అట్టింగల్ నుంచి విజయం సాధిస్తారన్న ఆయన.. అళప్పుళ నుంచి భాజపా నాయకురాలు శోభ సురేంద్రన్‌కు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
* సార్వత్రిక ఎన్నికల్లో (LokSabha Elections 2024) ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పుర్ (Nagpur)లో భాజపా (BJP) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా కిందిస్థాయిలో పనిచేయాలని సూచించారు.
* తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసం వద్ద ఆశావహుల సందడి నెలకొంది. ఆఖరి జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నివాసానికి మందకృష్ణ మాదిగ వచ్చారు. డేగల ప్రభాకర్‌ను వెంటబెట్టుకొని వచ్చిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రబాబును కలిశారు. విజయనగరం లోక్‌సభ కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.
* భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెళ్లికి అస్సలు ఇష్టపడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సుఖసంతోషాల గురించి ఎంత మాత్రం పట్టించుకోరు. పైగా సమాజం కూడా కొన్ని కట్టుబాట్ల పేరుతో రెండోపెళ్ళిని చిన్నచూపు చూస్తుంది. అలాంటి మహిళలకు భరోసా కల్పించాలనుకుంటున్న ఝార్ఖండ్ ప్రభుత్వం ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతువులు రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పెళ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్‌నీ, చనిపోయిన భర్త మరణధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే- వారి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తోంది. అయితే ఈ పత్రాలను పెళ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ ఈ పథకం వర్తించదు. ఏ అండా లేనివారిని ఆదుకోవాలనే ఈ నిర్ణయం.
* ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినియోగిస్తున్న కారుపై రూ.10,485 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. టీఎస్11ఈవీ 9922 నంబరు డిఫెండర్ వాహనంపై 2021 నుంచి ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు సార్లు చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో ఎంపీ వాహనంపై ఈ చలాన్లు విధించినట్టు తెలుస్తోంది.
* కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణలో గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని అన్నారు.
* ప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా.. ఆయన స్పందించారు. తాను ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని.. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసని.. 32 సంవత్సరాలుగా వివాదంలో లేని భూమి ఇప్పుడు ఎలా వివాదంలోకి వచ్చింది ? ప్రశ్నించారు.
* ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ( Chandra Babu) ను ఆదివారం విజయవాడలోని ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) , పరిస్థితులపై చర్చించుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z