2024 తానా ఎన్నికల్లో డా. కొడాలి నరేన్ వర్గం విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. తానా సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు మద్దతు తెలిపినవారికి నరేన్ ధన్యవాదాలు తెలిపారు. తానా ప్రతిష్ఠను పెంచేలా సేవ చేస్తామని తెలిపారు.
ఈ వేడుకలో శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజ కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, ఠాగూర్ మలినేని, సతీష్ కొమ్మన, శ్రీనివాస్ ఎండూరి, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కె పి సొంపల్లీ, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటిబండ్ల, జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేని మరియు వర్జీనియా నరేన్ కొడాలి మిత్ర బృందం సమన్వయపరిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z