ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని.. ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్‌ను తయారుచేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్‌తో దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్ తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. 1,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. దీనిని రూపొందించడానికి కోపర్నికి గ్రీక్ పరిశోధకుడు ఐయోనిస్ మిచెలౌడిస్ సహకరించారు. 27×16×6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ‘కోపర్ని’ దీన్ని ఆవిష్కరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z