* ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు.
* సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్‌రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని….వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్‌లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
* ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 21న పట్టి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు 50 ఏళ్ల వ్యాపారవేత్త మహ్మద్ నయీమ్‌పై కాల్పులు జరిపి చంపారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు, హంతకులైన పీయూష్ పాల్, శుభమ్ సోనీ, ప్రియాంషులను అరెస్ట్ చేశారు.
* ఏపీలో జరిగిన reMDu వేర్వేరూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నంద్యాల జిల్లా అయ్యలూరు జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహానాలు ఢీ కొనగా ఇద్దరు మృతి చెందారు. మృతులు నంద్యాల మసీదుపురానికి చెందిన వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామ శివారు అనాసాగరం రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సూపర్ లగ్జరీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z