అమెరికా(USA)లో అనూహ్య ఘటన జరిగింది. నౌక ఢీకొనడం(Ship Collision)తో బాల్టిమోర్ నగరంలో ఏకంగా ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది’ అని ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీస్థాయి కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టింది. దీంతో అది పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో వారధి(US Bridge) మీద ఉన్న పదుల సంఖ్యలో కార్లు నదిలో పడిపోయినట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z