తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆలయంలో ఏటా ఉత్తిరమ్ పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం నిరీక్షిస్తున్న జంటలు పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి నిమ్మకాయలను కొంటుంటారు. 9 రోజుల పాటు అమ్మవారి బల్లానికి గుచ్చిన నిమ్మకాయలను వేలం వేస్తారు. అందులో మొదటి రోజు వేలం వేసే నిమ్మకాయలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z