* జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్ వార్తలపై నవీన్ స్పందించాల్సి ఉంది. కాగా నవీన్ పొలిశెట్టి చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు. ఇందులో అనుష్కతో జోడీ కట్టాడు. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీని వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.
* బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
* బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు.
* యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Professor Rapes Student) బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తమ కస్టడీలోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఈ సంఘటన జరిగింది. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని భావించింది. దీని కోసం 44 ఏళ్ల కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ కుమార్ అనుమతి కోరింది. అయితే లైంగిక కోరిక తీర్చితే సహకరిస్తానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, బాధిత విద్యార్థిని మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొఫెసర్ రాజేందర్ కుమార్‌పై అత్యాచారం సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా మార్చి 30 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z