Movies

పిచ్చిరాతలు మానుకోండి

పిచ్చిరాతలు మానుకోండి

‘తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు. కేరక్టర్‌ పండించే క్రమంలో సాటి నటుడితో కాస్త క్లోజ్‌గా ఉంటాం. అది వృత్తి ధర్మం. దాన్నే నిజం అనుకుంటే ఎలా?’ అంటూ చిరుబురులాడింది ఢిల్లీ భామ రాశీఖన్నా. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘యోధ’ చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌మల్హోత్రతో రాశీఖన్నా స్క్రీన్‌ కెమిస్ట్రీపై బాలీవుడ్‌ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తున్నది. కొందరు నెటిజన్స్‌ అయితే, వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు రాసేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై రాశీఖన్నా స్పందించింది.

‘ నేను ఇంట్రావర్ట్‌. సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఇంట్రావర్ట్‌. ఇద్దరివీ త్వరగా కలిసే మనస్తత్వాలు కావు. ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే. దాంతో మా ప్రాంతం గురించి మాట్లాడుకునేవాళ్లం. అది కూడా అరుదుగానే. పైగా మేమిద్దరం పరిచయస్తులం కూడా కాదు. ఇక కెమెరా ముందుకొస్తే పాత్రోచితంగా నటించడం మా బాధ్యత. ‘యోధ’లో కథ అవసరం మేర నటించాం. తెరపై మా ఇద్దరి కెమిస్ట్రీ బావుందంటే, బయట కూడా అలాగే ఉంటాం అని కాదు. మా హద్దులు మాకు తెలుసు. మీ హద్దుల్లో మీరుంటే మంచిది’ అంటూ ఘాటుగా స్పందించింది రాశీఖన్నా

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z