Devotional

భద్రాచలం రాములవారి మూలవిరాట్‌ను ఫోటో తీసిన ఆగంతకుడు

భద్రాచలం రాములవారి మూలవిరాట్‌ను ఫోటో తీసిన ఆగంతకుడు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఫొటోలపై నిషేధం ఉండగా.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఫొటోలు తీసి వైరల్‌ చేయడంపై కేసు నమోదైంది. రాములవారిని మహబూబాబాద్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌ శనివారం నేతలు, కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన ఫోన్‌లో ఫొటోలు తీశారు. అందులో వెండి వాకిలి, బంగారు వాకిలితో పాటు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ నేత రామాలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని దర్శించుకోగా అక్కడా స్వామివారి విగ్రహం స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీశారు. అనంతరం వీటిని వాట్సప్‌లో షేర్‌ చేశారు. రామాలయం వాట్సప్‌ గ్రూప్‌తో పాటు పలు గ్రూపుల్లో అవి హల్‌చల్‌ చేశాయి. దీనిపై ఈఓ రమాదేవి తక్షణం స్పందించారు. ఫొటోలు తీసిన వ్యక్తిని సీసీ కెమెరాల సాయంతో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z