* సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మోసాలకు తెగబడ్డారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి ఫోన్ చేసిన నేరగాళ్లు.. బ్యాంకాక్ నుంచి మీ ఆధార్ నంబరుపై పార్శిల్ వచ్చిందని చెప్పారు. 17 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారి అవయవాలు తీసుకున్న కేసులోనూ నిందితులుగా ఉన్నారని.. సీబీఐ అధికారిగా పోన్ చేసి బెదిరించారు. సోదాలు చేసి కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. తండ్రి క్యాన్సర్ పేషెంట్, భార్య ఆరు నెలల గర్భవతి కావడంతో భయపడిన బాధితుడు కేసు అవ్వకుండా చూడాలని వేడుకున్నాడు. దీంతో సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు. వారు చెప్పినట్టు రూ.9.69లక్షలు పంపించాడు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
* వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నకిలీ జ్యోతిష్యున్ని కనకపుర పోలీసులు అరెస్టు చేసారు. ఫేస్‌బుక్‌లో జ్యోతిష్యునిగా చెప్పుకుని మోసం చేస్తున్న విష్ణు (22) నిందితుడు. విష్ణు బాగలకోటకు చెందినవాడు కాగా బెంగళూరు బసవేశ్వర నగరలో ఒక కాలేజీలో చదువుకుంటున్నాడు. మార్చి 9వ తేదీన ముత్తురాజు అనే వ్యక్తి కనకపుర తాలూకా టీ.బేకుప్పె అర్కావతి వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ఆత్మహత్యకు ఒక జ్యోతిష్యుడే కారణమని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో విష్ణు నికృష్ట స్వరూపం బయటపడింది.
* తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే.
* దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది,
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z