అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందారు. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం కొణకంచికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
More Info: https://www.oregonlive.com/news/2024/04/4-year-old-girl-dead-in-clackamas-county-car-crash.html
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z