Health

ఆ రోగాన్ని తయారు చేసింది రష్యన్లు-CrimeNews-Apr 01 2024

ఆ రోగాన్ని తయారు చేసింది రష్యన్లు-CrimeNews-Apr 01 2024

* తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీగా ఉన్న ఆయన్ని కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్‌ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశామని అంగీకరించారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు రాధాకిషన్‌రావు చెప్పారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

* రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్‌లో ఓ గ్యాంగ్‌ వీరంగం సృష్టించింది. తొలుత దుకాణానికి వెళ్లిన విద్యార్థిని పట్ల సురేశ్‌ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ రోజు దొరకలేదంటూ ఆమెపై నీళ్లు పోశాడు. అతడి నుంచి తప్పించుకొని యువతి ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. నిలదీసేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులపై సురేశ్‌ గ్యాంగ్‌ దాడికి దిగింది. సురేశ్‌ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపైనా దాడికి దిగాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

* అమెరికా దౌత్యవేత్తలను ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న హవాన సిండ్రోమ్‌ (హవన శ్యంద్రొమె) వెనుక రష్యా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ది ఇన్‌సైడర్‌, సీబీఎస్‌ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులో ఈ మేరకు ఆరోపించాయి. లాత్వియాకు చెందిన రిగా అనే గ్రూప్‌ కూడా వీటితో కలిసి పనిచేసింది. మరో వైపు మాస్కో మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్‌గా వ్యవహరిస్తున్నారు. దానికి గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్, వికారం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండ్రోమ్‌ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బందిలో గమనించారు. ఆ నగరం పేరు మీదుగా దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు.

* పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినందుకు క్యాబ్ డ్రైవర్‌ అయిన వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. (చబ్ ద్రివెర్ స్తబ్స్ గిర్ల్ఫ్రిఎంద్) ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల గిరీష్‌ బెంగళూరులోని జయనగర్‌లో నివసిస్తున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌ అయిన అతడు 2011లో చెల్లికి పెళ్లి సంబంధాలు కుదరని ఇబ్బందుల వల్ల ఇస్లాం మతంలోకి మారడంతోపాటు పేరును కూడా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇస్లాం మతాచారాలు పాటిస్తున్నప్పటికీ తన పేరును తిరిగి గిరీష్‌గా మార్చుకున్నాడు.

* ఏపీలోని పల్నాడులో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త మర్మాంగాలపై ఓ భార్య సలసల మసులుతున్న నీటిని పోసింది. దీంతో తీవ్ర గాయాలైన భర్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నాయిని ప్రభుదాస్‌, అనూష దంపతులు కొంతకాలంగా నివసిస్తున్నారు. ప్రభుదాస్‌ నెలవారీ పద్ధతిలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో అనూష తల్లిదండ్రులు కలుగజేసుకుని పెద్దల మధ్య సయోధ్య కుదిర్చారు. వారం కిందట అనూషను కాపురానికి పంపించారు. ఇంతలోనే భార్యభర్తల మధ్య ఏమైందో తెలియదు గానీ.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్త దగ్గరకు వెళ్లిన అనూష.. అతని మర్మాంగంపై సలసల కాగుతున్న వేడి నీటిని పోసింది. వేడి వేడి నీళ్లు పడటంతో ప్రభుదాస్‌ ఒక్కసారిగా కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వేడి నీళ్లు పడటంతో మర్మాంగంతో పాటు కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తన అత్తామామలే భార్యతో తనను చంపించేందుకు కుట్ర పన్నారని బాధితుడు ప్రభుదాస్‌ ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z