ScienceAndTech

ఐఐటీ బాంబే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు

ఐఐటీ బాంబే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు

అంత‌ర్జాతీయ స్థాయిలో ఆర్ధిక అనిశ్చితి దేశంలోని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క యూనివర్సిటీల్లో జరిగే ప్లేస్‌మెంట్స్‌పైనా ప్ర‌భావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్య‌ర్ధుల‌కు ప్ర‌స్తుత ప్లేస్‌మెంట్ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌రకూ ఉద్యోగాలు లభించలేదు. 2 వేల మంది ప్లేస్‌మెంట్‌లో నమోదు చేసుకుంటే వారిలో 712 మందికి ఇప్ప‌టికీ జాబ్ ఆఫ‌ర్లు రాకపోవడం గమనార్హం.

పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులకు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫ‌ర్లు పొంద‌లేక‌పోవ‌డం ఇదే తొలిసారి. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, అంతర్జాతీయ కంపెనీ సంఖ్య ఈసారి త‌క్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

కాగా, ఆర్ధిక అనిశ్చితి, ఇతరాత్ర కారణాల వల్ల ఐఐటీ బాంబే నిర్ధేశించిన ప్యాకేజీ ఇచ్చేందుకు సంస్థ మొగ్గుచూపడలేదని తెలుస్తోంది. అయితే ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు ప‌లు ద‌శల్లో ఆయా కంపెనీలు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయని అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z