జీయర్ ట్రస్టు అమెరికా వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృసంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు.
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET USA Inc) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతో పాటు గుడికి వెళ్లిన తన 11 ఏళ్ల కొడుకు రెండు భుజాలకు శంఖుచక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధపడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్యసేవలు కూడా అందించలేదని ఆరోపించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z