NRI-NRT

600మందికి తానా ఫౌండేషన్ – స్వేచ్ఛ ఉచిత వైద్యసేవలు

600మందికి తానా ఫౌండేషన్-స్వేచ్ఛ వైద్యసేవలు

గచ్చిబౌలిలో తానా ఫౌండేషన్-స్వేచ్ఛ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మెగావైద్యశిబిరాన్ని నిర్వహించారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్-ప్రియాంక దంపతులు ఈ శిబిరానికి ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 600మందికి ఉచితంగా వైద్యసేవలందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుండగా తానా ఫౌండేషన్ దీని నిర్వహణకు ఇప్పటివరకు అయిదు సార్లు సహకారం అందజేసింది.

గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ ప్రాంతాలకు చెందిన పేదలు ఈ శిబిరం ద్వారా లబ్ధిపొందారు. కంటి, ఆర్ధోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పిడియాట్రిక్స్ తదితర విభాగాలకు చెందిన 26 మంది వైద్యుల బృందం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన వారిని తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు అభినందించారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z