Politics

జనసేనకు చిరంజీవి భారీ విరాళం-NewsRoundup-Apr 07 2024

జనసేనకు చిరంజీవి భారీ విరాళం-NewsRoundup-Apr 07 2024

* హెరిటేజ్‌కు సంబంధించిన కీలక పత్రాల దహనం వీడియోలు చూసి తీవ్ర కలత చెందినట్లు ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐడీకి హెరిటేజ్‌ లేఖ రాసింది. సీఐడీ అడిగిందని ఐఆర్‌ఆర్‌ కేసులో కీలక పత్రాలు ఇచ్చామని, కేసు విచారణలో సహకరించేందుకే ఇలా చేశామని పేర్కొంది. ‘‘న్యాయ ప్రక్రియలో ఇచ్చిన పత్రాల గోప్యత బాధ్యత సీఐడీదే. మా కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలున్నాయి. తాజా స్థితిగతులపై వివరణ ఇవ్వాలి. అప్పుడే పత్రాలు సురక్షితంగా, సీఐడీ రక్షణలో ఉన్నాయని నమ్ముతాం. తాజా పరిణామాలపై మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హెరిటేజ్‌ లేఖలో పేర్కొంది.

* తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను దహనం చేయడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా?’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

* వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని.. కాల్ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తుచేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్‌ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సీనియర్ల అడుగుజాడల్లో నడిచానని గతంలో చెప్పిన మోదీ.. ఇప్పుడు భిన్నమైన వైఖరిని అవలంబిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

* ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్‌ సాయం చేస్తోందని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మారిషస్‌లకు భారత్‌ సాంకేతిక సాయం అందిస్తోందని తెలిపారు.

* గతంలో మోదీ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెండైన మాల్దీవుల మంత్రుల్లో మరియం షియునా ఒకరు. తాజాగా ఆమె తన దేశంలోని విపక్ష మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP)ని విమర్శిస్తూ పోస్టు పెట్టారు. ఆ పార్టీ పోస్టర్‌లో మన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని ఉపయోగించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

* ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు విషెస్‌ చెబుతున్నారు. ఈసందర్భంగా విడుదల చేసిన ‘పుష్ప2’ టీజర్‌ సోషల్‌ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో సందడి చేస్తోంది. బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన అగ్ర కథానాయకుడు చిరంజీవి.. ఈ టీజర్‌ అద్భుతంగా ఉందని..పుష్పరాజ్‌ రూల్‌ చేస్తాడన్నారు. ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్‌.. ‘థ్యాంక్యూ సో మచ్‌. టీజర్‌ను మీరు ప్రశంసించడం ఆనందాన్నిచ్చింది. ఎంతో థ్రిల్‌గా ఉంది’ అని రాసుకొచ్చారు. అలాగే, పుష్పరాజ్‌కు శుభాకాంక్షలు అంటూ ఇప్పటివరకు ఎవరూ చూడని అల్లు అర్జున్‌ స్టిల్‌ ఫొటోను షేర్‌ చేశారు రష్మిక.

* జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన చిరంజీవి. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ. 5 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందించిన చిరంజీవి. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన జనసేన. ముచ్చింతల్‌లో చిరంజీవిని కలిసిన పవన్‌, నాగబాబు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు స్వాగతం పలికిన చిరంజీవి. చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న పవన్‌.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రణీత్‌రావు డిసెంబర్‌ 4న మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశాడు. వీటి నుంచి డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మూసీలో కలిపిన హార్డ్‌ డిస్క్‌ శకలాల నుంచి కూడా వీటిని పొందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

* సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్‌కు సూచనలను టెక్ట్స్‌ రూపంలో గానీ, వాయిస్‌ మెసేజ్‌, పీడీఎఫ్‌గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి అజెండా అని తెలిపారు.

* కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) మాజీ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉం టుందో తెలియదన్నారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన మెదక్‌ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలకు మించి అధికారంలో ఉన్న రాష్ట్రాలు చాలా తక్కువ అని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సెల్ఫ్ గోల్స్‌తో ఐదు సంవత్సరాల కంటే ముందే అధికారం కోల్పోయిందని చెప్పారు. తెలంగాణ మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనని స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z